ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం సెనగపప్పు తీపి వడలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే సెనగపప్పు తీపి వడలు మీ సొంతం.
సెనగపప్పు తీపి వడలు కి కావలసిన పదార్ధాలు:
సెనగపప్పు - 1/2 కేజీ
యాలకులు - 5
బియ్యం పిండి - 1/2 కప్పు
పంచదార - కప్పు
నూనె - సరిపడ
సెనగపప్పు తీపి వడలు తయారు చేసే విధానం:
ముందుగ సెనగపప్పును ఉడికించి, నీళ్లు వంపేసి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు అందులో బియ్యం పిండి కలిపి అందులోనే యాలకుల పొడి, పంచదార కూడా వేసి కలుపుకోవాలి.
తరువాత ఈ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని గారెల్లాగా వత్తి, స్టవ్ మీద బాణలి పెట్టి కాగిన తరువాత నూనె వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. చివర్లో ఈ గారెలపైన పంచదార చల్లితే ఇంట్లోనే చాలా సులభంగా తాయారు చేసుకునే సెనగపప్పు తీపి వడలు తయార్.