ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం మామిడి కాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే మామిడి కాయ పప్పు మీ సొంతం.
మామిడి కాయ పప్పు కి కావలసిన పదార్ధాలు:
కందిపప్పు - 1 కప్పు
మామిడి కాయ - 1
ఉల్లిపాయ -1
పచ్చి మిర్చి -3
నీళ్ళు- 2 కప్పులు
పోపు దినుసులు - 1 స్పూన్
పసుపు - 1/2 స్పూన్
ఎండుమిర్చి -3
వెల్లులి - 4
నూనె- సరిపడ
ఉప్పు - సరిపడ
టమాట- 1
మామిడి కాయ పప్పు తయారు చేసే విధానం:
ముందుగ మామిడికాయని(పెద్ద)ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు కుక్కరులో కందిపప్పు, మామిడి కాయ ముక్కలు,
పచ్చి మిర్చి, పసుపు, టమాట నీళ్ళు వేసి మూడు విజల్స్ వచ్చే వరకు ఉంచలి.
ఇప్పుడు పప్పు బాగా ఉడికిన తరువాత ఒక కడాయిలో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి,
ఎండు మిర్చి, కరివేపాకు వేసి కాసేపు తాలింపు వేయాలి. ఈ తాలింపుని పప్పులో వేసి సరిపడ నీళ్ళు, ఉప్పు, కారం కలిపి మరికొద్దిసేపు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకొని. దింపుకోవాలి అంతే గుమగుమలాడే మామిడి కాయ పప్పు తయార్ దీనిని అన్నముతో కాని, చపాతితో కానీ తీసుకోవచ్చు.