ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పెసర్లసబ్జీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పెసర్లసబ్జీ మీ సొంతం.
పెసర్లసబ్జీ కి కావలసిన పదార్ధాలు:
మొలక పెసలు - 1/2 కప్పు
ఉల్లిపాయలు -2
టమోటాలు -2
పచ్చిమిర్చి-4
నూనె -సరిపడ
నీళ్ళు -సరిపడ
ఉప్పు -సరిపడ
పసుపు -1/2 స్పూన్
పెసర్లసబ్జీ తయారు చేసే విధానం:
ముందుగ పెసర్లను ముందురోజే నానబెట్టుకోవాలి. నీళ్లు వంపేసి బట్టలో కట్టి ఓ రోజు ఉంచితే మొలకలు వస్తాయి. తరువాత ఉల్లిపాయను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్‌మీద బాణలి పెట్టి ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
ఇప్పడు అందులో ఇందాక తయారు చేసిన ఉల్లిముద్ద కూడా వేసి మూడు నిమిషాలు వేయించిన తరువాత మొలక పెసల్ని కూడా వేసి సరిపడ ఉప్పు, నీళ్లు పోసి మూత పెట్టి మంట తగ్గించి సిమ్‌లో 5-10 నిమిషాలు ఉడికించి దించాలి. కిందికి దించేశాక కొన్ని పచ్చి ఉల్లిముక్కలు, కొత్తిమీరతో అలంకరించి వేడివేడి రోటీలతో పాటు వడ్డించాలి. అంతే చపాతీల కోసం వేడి వేడి పెసర్ల సబ్జీ తయార్.