ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కోవా రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే కోవా రోల్స్ మీ సొంతం.
కోవా రోల్స్ కి కావలసిన పదార్ధాలు:
పచ్చి పాలకోవా - 250 గ్రా
పంచదార -300 గ్రా
ఫుడ్ కలర్ - చిటికెడు
జీడిపప్పు -30 గ్రాములు
జాజికాయ - చిన్న ముక్క
కోవా రోల్స్ తయారు చేసే విధానం:
ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో తీసుకోని అందులో పచ్చికోవా, పంచదార రెండు కలిపి స్టావ్ మీద సన్నని మంటమీద గరిటెతో కలుపుతూ అడుగు మాడకుండా పాకం పట్టాలి. పాకం వచ్చిన తరువాత దానిని దించి గరిటెతో కలుపుతూ కోవాను చల్లార నివ్వాలి. కొంచెం సేపటి తరువాత కోవా ముద్దలాగా తయారవుతుంది.
ఇప్పుడు కొంచం కోవా ముద్దలో యాలకుల పొడి, జీడిపప్పు, ఫుడ్ కలర్‌లు కలిపి పక్కన ఉంచుకోవాలి. మిగిలిన కోవా నుండి మరి కొంచెం కోవా ముద్దను తీసుకుని పలుచగా చేసి, దాని మధ్యలో కలర్ కలిపిన మిశ్రమాన్ని పెట్టి చిన్న రోల్‌లాగా చుట్టుకోవాలి. అంతే తియ్య తియ్యని నోరూరించే కోవా రోల్స్ రెడీ.