ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం స్వీట్ పూరీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే స్వీట్ పూరీలు మీ సొంతం.
స్వీట్ పూరీలు కి కావలసిన పదార్ధాలు:
మైదాపిండి -1/4 కేజీ
నెయ్యి -100 గ్రా
ఫుడ్ కలర్ -చిటెకెడు
పంచదార- 1/2 కేజీ
పాలు -1/4 లీటర్
యాలకుల పొడి- 1/2స్పూను
స్వీట్ పూరీలు తయారు చేసే విధానం:
మైదా పిండిలో కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి, పాలు పోసి మెత్తగా ముద్ద చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద బాణలి పెట్టి, అందులో నూనె లేదా నెయ్యి పోసి కాగనివ్వాలి. కాగాక మైదా పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి మందపాటి పూరీల్లా వోత్తుకోవాలి. తరువాత నూనెలో వేసి ఎర్రగా వచ్చేవరకు వేయించాలి.
ఇప్పుడు మరో వైపున పంచదారలో రెండు కప్పుల నీళ్ళు పోసి అందులో యాలకుల పొడి, రంగు వేసి లేత పాకం వచ్చే వరకు ఉంచి దింపి పక్కన పెట్టుకోవాలి. తరువాత నూనెలో వేయించిన పూరీలను పాకంలో వేసి ముంచి రెండు నిముషాలు ఉంచి తీసి ఆ తరువాత వడ్డించుకోవాలి. అంతే స్వీట్ పూరీలు తయార్.