ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం స్వీట్ కార్న్ సమోస ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే స్వీట్ కార్న్ సమోస మీ సొంతం.
స్వీట్ కార్న్ సమోస కి కావలసిన పదార్ధాలు:
స్వీట్ కార్న్ - 1 కప్పు
పన్నీర్ -1 కప్పు
కొత్తిమీర - 1 కట్ట
గరం మసాల - 1 స్పూన్
అల్లం వెల్లుల్లి ఫేస్ట్ -1 స్పూన్
ఉప్పు - సరిపడ
మైదా -2 కప్పులు
నెయ్యి -2 స్పూన్స్
నూనె - వేయించడానికి సరిపడ
స్వీట్ కార్న్ సమోస తయారు చేసే విధానం:
ముందుగా మైదా పిండిలో కొద్దిగా వేడిచేసిన నూనె, సరిపడ ఉప్పు, నీళ్ళు పోసి కలిపి అరగంట సేపు నాననివ్వాలి. స్వీట్ కార్న్ ను ఉండకబెట్టు కొని ఒక గిన్నె లోకి తీసుకోవాలి. పన్నీర్, కొత్తిమీర ను విడివిడిగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి. నూనె వేడెక్కిన తర్వాత ఉడకబెట్టిన స్వీట్ కార్న్ ను, కట్ చేసుకున్న పనీర్ ముక్కలను కొద్ది సేపు వేయించుకోవాలి.
తర్వాత గరం మసాలా, అల్లంవెల్లులి ఫేస్ట్ ను వేసి మరి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత కొత్తిమీరను వేసి దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మైదా పిండిని చిన్న సైజు ముద్దలుగా చేసి చపాతీలా చేసుకోవాలి. మొత్తం అలా చేసుకున్న తర్వాత వాటిని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న చెపాతీలకు చుట్టూ నెయ్యి రాసి సమోసా ఆకారంలో మడుచుకోవాలి.
దీనిలో స్వీట్ కార్న్ మిశ్రమాన్ని స్పూన్ తో కూరుకొని సమోసా విడిపోకుండా మడుచుకోవాలి. అన్నీ ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత సమోసాలను వేయించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ సమోస తయార్.