కావలసిన పదార్ధాలు:
రెండు మామిడి పళ్ళు, కొబ్బరి పాలు, తగినంత పంచాదార రుచి కోసం, ఏలకులు 3
తయారు చేసే విధానం:
ముందుగా మామిడి పళ్ళను జూస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇపుడు కొబ్బరి పాలను జూసర్ లో వేసి బాగా బ్లెండ్ చేయాలి. తరువాత మామిడి పళ్ళ జూస్, కొబ్బరి పాలను కలిపేయాలి. జూస్ తీపిగా లేకపోతె రుచికి సరిపడా పంచదార వేసుకోవచ్చు. తరువాత ఏలకులు పెనం మీద వేయించి ఆ పొడిని జూస్ లో వేసి బాగా కలపాలి. అంతే, సమ్మర్ స్పెషల్ మ్యాంగో జూస్ రెడీ.