ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం స్పెషల్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే స్పెషల్ ఎగ్ కర్రీ మీ సొంతం.
స్పెషల్ ఎగ్ కర్రీ కి కావలసిన పదార్ధాలు:
టమోటాలు - 6
కోడిగుడ్లు -4
ఉల్లిపాయలు - 3
పచ్చిమిర్చి- 4
కరివేపాకు - కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1స్పూన్
పసుపు - 1/4 స్పూన్
కారం పొడి - 1 స్పూన్
ఉప్పు - సరిపడ
గరం మసాలా పొడి - 1/2 స్పూన్
కొత్తిమీర - సరిపడ
నూనె - సరిపడ
స్పెషల్ ఎగ్ కర్రీ తయారు చేసే విధానం:
ముందుగ ఉల్లిపాయ, టమోటోలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. తరువాత బాణలిలో నూనె పోసి కాగాక సన్నగా తరిగి పెట్టుకొన్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి ఎర్రగా వేయించాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, కరివేపాకు వేసి ఇంకా కొద్ది సేపు వేయించాలి. తరువాత టమోటో ముక్కలు, తగినంత ఉప్పువేసి బాగా కలిపి మూత పెట్టాలి. ముక్కలు బాగా ఉడికిన తరువాత అరకప్పు నీరు పోసి మెత్తగా ఉడికించాలి.
నీరంతా ఇగిరిపోయాక గుడ్లు కొట్టిపోయాలి. వాటిని కలపకుండా అలాగే ఉంచి మూతపెట్టాలి. దీనివలన గుడ్డు పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటుంది. చివరగా గుడ్డు ఉడికాక మెల్లిగా కలిపి గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. అంతే టమోటో స్పెషల్ ఎగ్ కర్రీ రేడి. రైస్ చపాతీలకు మంచి కాంబినేషన్.