ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే స్పాంజ్ కేక్ మీ సొంతం.
స్పాంజ్ కేక్ కి కావలసిన పదార్ధాలు:
మైదా పిండి -2 కప్పులు
పంచదార - 2 కప్పులు
బేకింగ్ పౌడర్ -1/2 స్పూన్
వెనిలా ఎసన్స్ - 1/2 స్పూన్
వెన్న - 1/2 కప్పు
నీళ్ళు - 1/2 కప్పు
గుడ్లు - 4
ఉప్పు - చిటికెడు
స్పాంజ్ కేక్ తయారు చేసే విధానం:
ముందుగా మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్ ని కలిపి జల్లించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వెన్న, పంచదార వేసి బాగా కలిపి పేస్టులా చెయ్యాలి. తరువాత మరొక గిన్నెలో గుడ్లు కొట్టి పోసి ఎగ్ బీటర్ తో బాగా నూరగ వచ్చే వరకు గిలక్కొట్టాలి. ఇప్పుడు దీనిని వెన్న మిశ్రామములో కొద్ది కొద్దిగా పోస్తూ బాగా కలిపి దీనికి వెనిలా ఎసన్స్ కూడా చేర్చిబాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో జల్లించిన మైదా వేసి కలిపి మరి గట్టిగా కాకుండా కాస్త పలుచగా కలుపుకోవాలి.
అవసరమైతే కొన్ని పాలు కూడా వేసుకోవచ్చు. తరువాత కేక్ పాత్రలో నెయ్యి రాసి అందులో ఈ మిశ్రామన్ని పోసి 40 నిముషాలు 38 డిగ్రీల ఫారెన్ హీట్ లో బేక్ చేయాలి. తయారయిన తరువాత చల్లారనిచ్చి కావలసిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. అంతే ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకొనే స్పాంజ్ కేక్ తయార్.