ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం సేమ్యా పకోడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే సేమ్యా పకోడి మీ సొంతం.
సేమ్యా పకోడి కి కావలసిన పదార్ధాలు:
సేమ్యా - 1/4 కేజీ
శనగపిండి - 1/4 కేజీ
బియ్యం పిండి - 4 స్పూన్స్
ఉల్లిపాయ ముక్కలు - 2 కప్పులు
పచ్చి మిర్చి - 2 స్పూన్లు
కారం - 1 స్పూన్
ఉప్పు - సరిపడ
సేమ్యా పకోడి తయారు చేసే విధానం:
ముందుగ సేమ్యాను నీళ్ళలో కొంచం పలుకు గా ఉడికించాలి. ఇప్పుడు ఈ సేమ్యాను కాటన్ గుడ్డపై బాగా ఆర బెట్టుకోవాలి. తర్వాత, దాన్ని ఒక గిన్నె లోకి తీసుకుని శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కారం, ఉప్పు, నీళ్ళు కలిపి పకోడీ పిండిలా కలుపుకోవాలి.
తరువాత బాణలిలో నూనె పోసి కాగిన తరువాత అందులో మనం అంతకుముందు కలుపుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేయాలి. అది దోరగా వేగిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి అంతే వేడి వేడి సేమ్యా పకోడి రేడి.