ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం సేమ్యా కట్ లెట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే సేమ్యా కట్ లెట్ మీ సొంతం.
సేమ్యా కట్ లెట్ కి కావలసిన పదార్ధాలు:
సేమ్యా - 2 కప్పులు
నీళ్ళు - 6 కప్పులు
బంగాళాదుంపలు -1/2 కేజీ
ఉల్లిపాయలు - 1/4 కేజీ
మైదా పిండి - 1/2 కప్పు
అల్లం - చిన్నముక్క
కొత్తిమీర - కొంచం
నిమ్మరసం - 2 స్పూన్స్
గరంమసాలా - 1/2 స్పూన్
నూనె - 1 స్పూన్
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి -సరిపడ
సేమ్యా కట్ లెట్ తయారు చేసే విధానం:
ముందుగా బంగాళాదుంపలు ఉడికించి పెట్టుకోవాలి. చల్లారిన తరువాత తొక్కు తీసి మెత్తగా చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నీళ్ళు పోసి మరుగుతుండగా ఉప్పు, నూనె వేసి కలపాలి. తరువాత అందులోనే సేమ్యాను వేసి కొంచం ఉడికిన తరువాత నీటిని వార్చేసి విడిగా ఆరబెట్టాలి. అల్లం, పచ్చిమిర్చిని మెత్తగా రుబ్బుకోవాలి.
మైదాపిండిలో తగినంత ఉప్పువేసి మెత్తగా కలుపుకోవాలి. దీంట్లో బంగాళాదుంప ముద్ద, అల్లంపచ్చిమిర్చి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన సేమ్యా, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కట్‌లెట్‌ల మాదిరిగా వత్తుకోవాలి. తర్వాత పెనం వేడెక్కినాక సేమ్యా కట్ లెట్ లను రెండువైపులా నూనె వేస్తూ ఎర్రగ వేయించుకోవాలి. వీటిని వేడిగా ఉన్నప్పుడే టొమోటో సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.