Home » Telugu Recipes » Homemade సున్నుండలు cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

సున్నుండలు


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే సున్నుండలు మీ సొంతం.

సున్నుండలు కి కావలసిన పదార్ధాలు:

మినపప్పు - 2 కప్పులు
పెసర పప్పు - 1 కప్పు
పంచదార - 2 కప్పులు
యాలకుల పొడి - 1/2 స్పూన్ నెయ్యి - 1/2 కప్పు
జీడిపప్పు, బాదాం పప్పు పొడి - 1/2 కప్పు

సున్నుండలు తయారు చేసే విధానం:

ముందుగా మినపప్పు ని, పెసర పప్పుని కలిపి నూనె లేకుండా బాణలిలో వేసి ఎర్రగా వేయించుకొని చల్లార నివ్వాలి. తరువాత ఈ రెండిటిని కలిపి మిక్సిలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోని అందులో పంచదార, జీడిపప్పు, బాదాం పప్పు పొడి, యాలకుల పొడి వేసి బాగా కలిపి అందులో వేడి చేసుకున్న నెయ్యిని కొంచం కొంచం వేస్తూ ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ లాడ్డు లని ప్లేట్ లో పెట్టి అరగంట సేపు ఆరనివ్వాలి. అంతే తియ్య తియ్యని సున్నుండలు తయార్. అంతే కాకుండా పిల్లలు పెద్దలు వీటిని ఇష్టంగా తింటారు.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com