ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం సగ్గు బియ్యం వడలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే సగ్గు బియ్యం వడలు మీ సొంతం.
సగ్గు బియ్యం వడలు కి కావలసిన పదార్ధాలు:
బంగాళదుంపలు - 1/4 కేజీ
సగ్గు బియ్యం- 1 కప్పు
పచ్చిమిర్చి- 8
శెనగపప్పు - 1/2 కప్పు
ఉప్పు - సరిపడ
నూనె - సరిపడ
అల్లం పేస్టు - 2 స్పూన్స్
సోడా ఉప్పు - కొద్దిగ
కొత్తిమీర - కొద్దిగ
సగ్గు బియ్యం వడలు తయారు చేసే విధానం:
ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. శెనగపప్పుని కూడా నానపెట్టి పలుకుగా మిక్సి చేసుకోవాలి. తరువాత బంగాళదుంపలని మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన సగ్గు బియ్యాన్ని నీరు లేకుండా వడికట్టి ఓ పాత్రలోకి తీసుకోవాలి.
తరువాత సగ్గుబియ్యంలో పచ్చిమిర్చి, ఉప్పు, శెనగపప్పు మిశ్రమం, బంగాళా దుంపలు, అల్లం పేస్టు, సోడా ఉప్పు, కొత్తిమీర వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి వడకు తగినట్లు సిద్ధం చేసుకోవాలి. తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగాక సగ్గుబియ్యం మిశ్రమాన్ని చిన్న వడల్లా చేసి నూనెలో దోరగా వేయించుకోవాలి. వీటిని టమోటా సాస్ లేదా ఏదైనా చట్నీతో వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.