ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం శ్రీఖండ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే శ్రీఖండ్ మీ సొంతం.
శ్రీఖండ్ కి కావలసిన పదార్ధాలు:
తాజా పెరుగు - 500 గ్రా
పంచదార - 400 గ్రా
కుంకుమ పువ్వు- కొద్దిగ
పాలు -2 స్పూన్స్
బాదంపప్పు- సరిపడ
యాలకులు- 4
ఎండుద్రాక్ష - సరిపడ
శ్రీఖండ్ తయారు చేసే విధానం:
ముందుగ పల్చటి గుడ్డ లో పెరుగును పోసి మూట కట్టి వ్రేలాడదీయాలి. నీరంతా కరిపోవలి. తరువాత వేడి పాలలో కుంకుమ పువ్వు వేసి నానపెట్టాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నెకి పల్చటి గుడ్డ కట్టి అందులో వడ కట్టిన పెరుగు, పంచదార వేసి మెత్తగా కలపాలి.
పంచదార బాగా కరిగిన తరువాత కుంకుమ పువ్వు కలిపిన పాలు, యాలకుల పొడి కుడా వేసి కలిపి చిన్నచిన్న గిన్నెలలోకి తీసుకోని దాని పైన బాదం, పిస్తా పప్పులు వేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. అంతే చల్ల చల్లని తాజా శ్రీ ఖండ్ తయార్. ఫ్రిజ్ లో పెట్టి అరగంట తరువాత తింటే చాలా రుచిగా ఉంటుంది.