ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం శనగపప్పు బఠాణీల కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే శనగపప్పు బఠాణీల కూర మీ సొంతం.
శనగపప్పు బఠాణీల కూర కి కావలసిన పదార్ధాలు:
పచ్చిశెనగపప్పు - 1/4 కేజీ
పచ్చిబఠాణీలు - 150 గ్రా
అల్లం - చిన్న ముక్క
ఉల్లిపాయ - 1
టమాటో - 2
పచ్చిమిర్చి - 1 స్పూన్
పంచదార - 1 స్పూన్
ఆమ్‌చూర్ - 1 స్పూన్
నిమ్మకాయ -1
నూనె -సరిపడ
పోపు గింజలు - 1 స్పూన్
కొత్తిమీర - కొంచం
కొబ్బరి తురుము - 2 స్పూన్స్
ఉప్పు - సరిపడ
కారం - 1 స్పూన్
శనగపప్పు బఠాణీల కూర తయారు చేసే విధానం:
ముందుగా శెనగపప్పును శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోయాలి. అందులోనే బఠాణీలు, ఉప్పు వేసి ఉడికించాలి. తరువాత అల్లం, పచ్చిమిర్చి కలిపి ముద్దగా నూరుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాగాక పోపు గింజలు, పచ్చిమిర్చి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పసుపు వేసి బాగా వేయించాలి.
తరువాత అందులో ఉడికించిన పప్పు, కారం, ఉప్పు, వేసి కలపాలి. తరువాత పంచదార, ఆమ్‌చూర్, కొబ్బరి తురుము వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. చివర్లో నిమ్మరసం పిండి, పైన కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే వేడి వేడి శనగపప్పు బఠాణీల కూర రేడి ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలు, రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.