ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం వెజిటేబుల్ సమోస ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే వెజిటేబుల్ సమోస మీ సొంతం.
వెజిటేబుల్ సమోస కి కావలసిన పదార్ధాలు:
మైదా - 1/2 కేజీ
నూనె - 2 స్పూన్స్
ఉప్పు - సరిపడ
కూర కోసం
ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
క్యారెట్ తురుము - 1 కప్పు
క్యాబేజీ తురుము - 1 కప్పు
అల్లం వెల్లుల్లి తురుము - 2 స్పూన్స్
కారం - 1/2 స్పూన్
పచ్చిమిర్చి - 2
ధనియాలపొడి - 1/2 స్పూన్
గరం మసాల - 1/2 స్పూన్
నిమ్మ ఉప్పు - చిటికెడు
ఉప్పు - తగినంత
నూనె - సరిపడ
వెజిటేబుల్ సమోస తయారు చేసే విధానం:
ముందుగ మైదాపిండిలో ఉప్పు, నూనె వేసి తగినన్ని నీళ్లతో చపాతీపిండిలా మెత్తగా ఉండేలా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి పెద్ద సైజు పూరీల్లా ఒత్తాలి. రొట్టెలపెనంమీద వీటిని కాల్చితే రుమాలీ రోటీల్లా వస్తాయి. ఇప్పుడు ఈ రోటీని నిలువుగా మూడు ముక్కలుగా అంటే రిబ్బన్లలా కోయాలి. తరువాత బాణలిలో కొద్దిగా నూనె వేసి సన్నగా తరిగిన కూరగాయ ముక్కల్నీ ఇతర దినుసుల్నీ వేసి కొద్దిగా మగ్గించి దింపుకోవాలి.
రోటీ రిబ్బన్ ముక్కల్ని ఓ వైపు నుంచి కోన్‌లా చుట్టి ఆ కోన్‌లో కూర మిశ్రమాన్ని పెట్టాలి. తరవాత దీన్ని త్రికోణాకారం వచ్చేలా మడిచి, అంచుల్ని మైదాపిండితో అంటించాలి. ఇలా చేసిన సమోసాల్ని కాగుతున్న నూనెలో ఎర్రగా వేయించి తీయాలి. వేడి వేడి వెజిటేబుల్ సమోస తయార్.