ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం వెజిటేబుల్ ఫ్రైడ్ చపాతీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే వెజిటేబుల్ ఫ్రైడ్ చపాతీ మీ సొంతం.
వెజిటేబుల్ ఫ్రైడ్ చపాతీ కి కావలసిన పదార్ధాలు:
క్యారెట్ తురుము - 1 కప్పు
కాలీఫ్లవర్ తురుము-1 కప్పు
బీట్‌రూట్ తురుము- 1 కప్పు
ఉల్లిపాయ తురుము -1 కప్పు
కొబ్బరి తురుము- 1 కప్పు
పచ్చి మిర్చి -4
వెల్లుల్లి -4
అల్లం - చిన్న ముక్క
పంచదార -1 స్పూన్
నిమ్మకాయ - ఒకటి
జీలకర్ర - 1 స్పూన్
ఉప్పు - సరిపడ
వెజిటేబుల్ ఫ్రైడ్ చపాతీ తయారు చేసే విధానం:
ముందుగా చపాతీలను రాత్రిపూటనే తయారుచేసి ఒక హాట్ ప్యాక్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ఉదయాన్నే వాటిని తీసి ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన బాణలి పెట్టి వేడయ్యాక నూనె వేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి అల్లం పేస్ట్‌లను వేయించాలి. బాగా వేగిన తరువాత జీలకర్ర, సోంపు గింజలను, తురిమి ఉంచుకున్న పదార్థాలనువేసి వేయించాలి.
ఆ తరువాత లెమన్ జ్యూస్, పంచదార, కొబ్బరి తురుమును కూడా చేర్చాలి. ముక్కలు చేసిన చపాతీలను ఈ మిశ్రమంలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి దించేయాలి. అంతే క్యారెట్, కాలీఫ్లవర్, బీట్‌రూట్ తురుములతో తయారైన ఫ్రైడ్ చపాతీ రెడీ. దీనికి టమోటా సాస్ వాడుకోవచ్చు.