ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం వెజిటేబుల్ కట్ లెట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే వెజిటేబుల్ కట్ లెట్ మీ సొంతం.
వెజిటేబుల్ కట్ లెట్ కి కావలసిన పదార్ధాలు:
క్యారెట్ -1/4 కేజీ
బీన్స్ -1/4కేజీ
పచ్చిమిర్చి- 5
పంచదార - 1 స్పూన్
ఉప్పు - సరిపడ
బ్రెడ్ ముక్కలు - 50 గ్రా
నూనె- సరిపడ
వెజిటేబుల్ కట్ లెట్ తయారు చేసే విధానం:
ముందుగ బ్రెడ్ ముక్కల్ని పొడి చేసి పెట్టుకోవాలి. తరువాత క్యారెట్, బీన్స్. పచ్చిమిర్చి ని సన్నని ముక్కలుగా చేసి
వీటిపై కొద్దిగా ఉప్పు చల్లి తగినన్ని నీళ్ళు పోసి బాగా ఉడికించాలి.
ఉడికిన తరువాత నీళ్ళు వంపేసి పంచదార, సరిపడ ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకొని ముందుగ తయారు చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని పొడిని అందులో కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాగాక ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా అరచేతిలోకి తీసుకోని వత్తుకొని నూనె లో వేసుకోవాలి ఎర్రగా అయిన తరువాత తీసుకోవాలి. నిమిషాలలో వెజిటేబుల్ కట్ లెట్ రేడి దీనిని సాస్ తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.