ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం వాంగీ బాత్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే వాంగీ బాత్ మీ సొంతం.
వాంగీ బాత్ కి కావలసిన పదార్ధాలు:
చిన్న వంకాయలు- 1/2 కేజీ
సన్న బియ్యం - 1/2 కేజీ
నూనె - సరిపడ
ఎండుకొబ్బరి ముక్కలు - 100 గ్రా
పచ్చిబఠాణి - 50 గ్రా
జీడీపప్పు - 50 గ్రా
నిమ్మకాయ - 1
ఎండుమిర్చి -10
ఉప్పు సరిపడ
మినపప్పు - 2 స్పూన్స్
శనగపప్పు - 2 స్పూన్స్
ధనియాలు - 2 స్పూన్స్
గరంమసాలా- 1 స్పూన్
ఇంగువ - చిటికెడు
నెయ్యి - 25 గ్రా
వాంగీ బాత్ తయారు చేసే విధానం:
వంకాయల్ని ఉప్పు నీటిలో సన్నగా పొడవుగా తరిగి వేయాలి. బియ్యాన్ని కాస్త పదునుగా వండుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణాలి పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో శనగపప్పు, మినపప్పు వేసి కాస్త వేగాక ఎండుమిర్చి, ధనియాలు, కరివేపాకు, కొబ్బరి ముక్కలు, ఇంగువ, గరం మసాలా, వేసి దోరగా వేయించి పొడి చేసి ఉంచాలి. బాణాలిలో మరికాస్త నూనె పోసి వంకాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి.
తరువాత అదే బాణాలిలో ఇంకాస్త నూనె వేసి జీడిపప్పు దోరగా వేయించి తరువాత వంకాయ ముక్కలు, ఎండుమిర్చిపొడి, గరంమసాలా, తగినంత ఉప్పు వేసి నెయ్యి పోసి గరిటతో నెమ్మదిగా కలిపి కొద్దిగా ఉడికిన తరువాత దింపుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి ప్లేట్ లోకి అన్నం తీసుకుని వంకాయ కొద్దిగా చల్లారిన తరువాత, వంకాయ మసాల వేసి బాగా కలిపి పైన నిమ్మకాయ పిండి, చివరిగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వాంగీ బాత్ తయార్.