ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం వంకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే వంకాయ పచ్చడి మీ సొంతం.
వంకాయ పచ్చడి కి కావలసిన పదార్ధాలు:
పావు కిలో వంకాయలు, 4 టమాటలు, 2o పచ్చి మిరపకాయలు, ఉప్పు తగినంత, ఒక టీ స్పూన్ పసుపు,నూనె,కొద్దిగా ఆవాలు , జీలకర్ర, చాయ మినపప్పు ,కొత్తిమీర, కరివేపాకు,సరిపడా చింతపండు.
వంకాయ పచ్చడి తయారు చేసే విధానం:
వంకాయలు,టమాటలు కడిగి ముక్కలు చేసుకోవాలి .ఒక ప్యాన్ లో నూనె పోసి ఆవాలు, కరివేపాకు ఆకులు, మెంతులు వేసి తాలింపు వేయాలి. అవి మాడి పోకుండా జాగ్రత్త వహించండి. ఆ తరువాత తరిగిన పచ్చి మిరపకాయలు, వంకాయలు,టమాట ముక్కలు వేసి పది నిమిశాల పాటు వేయించాలి. అవి మాడి పోకుండా జాగ్రత్త వహించండి. కొంచెం చింతపండును నీళ్ళల్లో నానబెట్టాలి. తరువాత నానబెట్టిన చింతపండు, పచ్చి మిరపకాయలు, పసుపు, ఉప్పు ,వంకాయలు,టమాట ముక్కలు వేసి మెత్తని పేస్టు లాగ గ్రైండ్ చేసుకోవాలి.ఆ తరువాత ఆవాలు నూనె లో తాలింపు వేసి పచ్చడిలో కలిపేయాలి.అంతే వంకాయ పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.