ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం లవంగి లతలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే లవంగి లతలు మీ సొంతం.
లవంగి లతలు కి కావలసిన పదార్ధాలు:
మైదా పిండి - 1/2 కేజీ
బియ్యం పిండి - 1 కప్పు
పాలు - 2 కప్పులు
పంచదార - 2 కప్పులు
నెయ్యి -1/2 కప్పు
నూనె- సరిపడ
లవంగి లతలు తయారు చేసే విధానం:
ముందుగా మైదా పిండిని జల్లెడ పట్టుకొని వేడి పాలను అందులో పోసి పూరి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా చేసిన ముద్దను కనీసం గంటన్నర వరకైనా నానపెట్టాలి. తరువాత పంచదారను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిలో పంచదారపొడి, నెయ్యి వేసి ముద్దగా కలుపుకోవాలి. తరువాత మైదా పిండిని పెద్ద వుండలుగా చేసుకుని పెద్ద సైజు చపాతీలుగా వత్తుకోవాలి. ఇప్పుడు ఆ చపాతీల మీద తయారుగా ఉంచుకున్న బియ్యం పిండి ముద్దను కొద్దిగా తీసుకోని చపాతీలపై పలుచగారాయాలి.
తర్వాత చపాతీలని రోల్ లాగా చుట్టి చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను చిన్న పూరిలగా చేసి నూనెలో వేయించుకోవాలి. రెండు వైపులా కొద్దిగా కాలిన తరువాత తీసి వేడిగా ఉన్నప్పుడే పంచదారపొడిని రెండు వైపులా చల్లుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన లవంగి లతలు తయార్. వీటిని స్టీలు డబ్బాలో వేసి పెడితే పది రోజుల వరకు నిల్వ ఉంటాయి.