ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం రాజ్మ మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే రాజ్మ మసాలా కూర మీ సొంతం.
రాజ్మ మసాలా కూర కి కావలసిన పదార్ధాలు:
రాజ్‌మా - 2కప్పులు
ఉల్లిపాయలు - 2
టమోటాలు -2
అల్లంవెల్లుల్లి -1 స్పూన్
పచ్చిమిర్చి-3
ధనియాలపొడి - 1/2 స్పూన్
గరంమసాలా - 1/2 స్పూన్
పోపు గింజలు - 1 స్పూన్
కారం -1 స్పూన్
పసుపు - కొద్దిగ
నూనె - సరిపడ
కొత్తిమీర - కొద్దిగ
ఉప్పు - సరిపడ
రాజ్మ మసాలా కూర తయారు చేసే విధానం:
ముందుగా రాజ్‌మాను రాత్రంతా నానపెట్టుకోవాలి. తరువాత వాటిని బాగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి కాగాక పోపు గింజలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా వేయించాలి. తరువాత ఉల్లిపాయ, టొమోటో ముక్కలను వేసి బాగా కలిపి కొద్ది సేపు మగ్గించాలి.
తరువాత అందులోనే ఉడికించిన రాజ్‌మా, కారం, పసుపు, ఉప్పు వేసి, సరిపడ నీళ్ళు పోసి బాగా కలిపి ఉడికించాలి. మంట తగ్గించి గ్రేవీ చిక్కబడేంతదాకా ఉంచి దించే ముందు ధనియాలపొడి, గరంమసాల వేసి పైన కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రాజ్మ మసాలా కర్రీ తయార్ దీన్ని వేడి వేడి చపాతీలు, అన్నంలోకి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది.