ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం రాగి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే రాగి లడ్డూలు మీ సొంతం.
రాగి లడ్డూలు కి కావలసిన పదార్ధాలు:
రాగిపిండి - 1/2 కేజీ
నువ్వులు - 100 గ్రా
వేరుశెనగపప్పు- 100గ్రా
బెల్లం - 1/4 కేజీ
నెయ్యి -150 గ్రా
రాగి లడ్డూలు తయారు చేసే విధానం:
ముందుగ బాణలిలో నెయ్యి వేసి కాగాక రాగిపిండి కూడా వేసి బాగా కలిపి దోరగా వేయించాలి. మరో బాణలిలో వేరుశెనగపప్పు, నువ్వులు కూడా విడివిడిగా వేయించి పొడిచేసి ఉంచాలి. బెల్లం సన్నగా తురిమి ఉంచుకోవాలి.
ఇప్పుడు ఒక పాత్రలో రాగిపిండి, వేరుశెనగప్పుల పిండి, బెల్లం తురుములను వేసి మెత్తగా కలిపి ఉండలుగా చుట్టుకోవాలి. రెండు గంటలపాటు గాలిలో ఆరబెట్టి తరువాత సర్వ్ చేయాలి. అంతే గుమగుమలాడే రాగి లడ్డూలు తయార్ అంతే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది.