ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం రాగి దోసెలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే రాగి దోసెలు మీ సొంతం.
రాగి దోసెలు కి కావలసిన పదార్ధాలు:
రాగి పిండి -1/2 కేజీ
ఉల్లిపాయలు -2
పచ్చిమిర్చి - 10
పెరుగు - 1/4 లీటర్
మినప్పప్పు -100 గ్రా
ఉప్పు -సరిపడ
సోడాఉప్పు- చిటికెడు
రాగి దోసెలు తయారు చేసే విధానం:
మినపప్పుని రాత్రే నానబెట్టుకోవాలి. తరువాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
తరువాత ఇందులో పెరుగు రాగి పిండి, సరిపడ ఉప్పు, సోడాఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ మీద పెనం పెట్టి కాలిన తరువాత
దోసె లాగా వేసుకోవాలి. రెండు వైపులా బాగా కాలిన తరువాత తీసుకోవాలి. దీనిని సాంబార్ తో కానీ, చట్ని తో కానీ తింటే
చాలా రుచిగా ఉంటాయి.