కావలసిన పదార్ధాలు:
1 గ్లాస్ బొంబాయి రవ్వ, కొబ్బరి చిప్ప, 50 గ్రాముల జీడి పప్పు, కొద్దిగా నెయ్యీ , 1 గ్లాస్ పంచదార,1 స్పూన్ యాలుకల పొడి.
తయారు చేసే విధానం:
స్టవ్ మీద ఒక మందపాటి కళాయీ పెట్టుకొని స్టవ్ వెలిగించాలి. దానిలో 3 స్పూన్ ల నెయ్యీ వేసి కాగాక జీడిపప్పు వేసి దోరగా వేగనివ్వాలి. వేగిన జీడిపప్పు, ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నెయ్యీలో బొంబాయి రవ్వ వేసి కొద్దిగా దోరగా వేగనివ్వాలి. దీన్నిఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. దీనిలోనే తురుముకున్న పచ్చికొబ్బరి వేసి 5 నిముషాలు వేగనివ్వాలి. తరువాత పంచదార వేసి మరో 5 నిముషాలు కలపాలి. పంచదారకరిగి కరగ నట్టుగా ఉండగానే యాలుకల పొడి, జీడిపప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. ఇది కొద్దిగా వేడిగా ఉండగానే ముద్దలుగా చేసుకోవాలి.ముద్దలు కట్టడానికి రాకపోతే కొద్దిగా కాచి చల్లార్చిన పాలు పోసి కలిపి ముద్దలుగా చేస్తే సరి . అంతే ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు తినడానికి రెడీ.