కావలసిన పదార్ధాలు:
1 గ్లాస్ బొంబాయి రవ్వ, 1 గ్లాస్ పంచదార, నెయ్యీ సరిపడా, 50 గ్రాముల జీడిపప్పు, కిస్మిశ్స్, 3 యాలుకలు, ఫుడ్ కలర్ ఎరుపు లేదా ఆరంజ్
తయారు చేసే విధానం:
తరువాత స్టవ్ మీద ఒక మందపాటి కళాయీ పెట్టుకొని స్టవ్ వెలిగించాలి. దానిలో 3 స్పూన్ ల నెయ్యీ వేసి కాగాక జీడిపప్పు, కిస్మిశ్స్ వేసి దోరగా వేగనివ్వాలి. వేగిన జీడిపప్పు, కిస్మిశ్స్ ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నెయ్యీలో బొంబాయి రవ్వ వేసి 2 నిముషాలు వేగనివ్వాలి. దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయీలో 2 గ్లాస్ ల మంచినీలు పోసుకొని మరిగిన తరువాత పంచదార, చిటికెడు ఫుడ్ కలర్ వెయ్యాలి . అది కరిగిన తరువాత బొంబాయి రవ్వ కొద్దిగా కొద్దిగా పోస్టు కలుపుతూ ఉండాలి. మూత పెట్టుకొని 5 నిముషాలు ఉడక నివ్వాలి. రవ్వ ఉడికిన తరువాత స్టవ్ ఆపేయాలి. తరువాత వేగిన జీడిపప్పు, కిస్మిశ్స్ కలుపుకోవాలి. అంతే రుచికరమైన రవ్వ కేసరి రెడీ.