ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం మొగలాయి వెజ్ పలావు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే మొగలాయి వెజ్ పలావు మీ సొంతం.
మొగలాయి వెజ్ పలావు కి కావలసిన పదార్ధాలు:
బాస్మతి బియ్యం - 2 కప్పులు
అనాస,ఆపిల్,మామిడి పండ్ల ముక్కలు -1 కప్పు
క్యారెట్, బీన్స్ ముక్కలు - 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము- 3 స్పూన్స్
ధనియాలు- 3 స్పూన్స్
అల్లం, వెల్లుల్లి - 1 స్పూన్
గసగసాలు - 1 స్పూన్
జీడిపప్పు -కొద్దిగా
నూనె -సరిపడ
ఉప్పు -సరిపడ
పచ్చిమిర్చి -5
యాలకులు -4
గరం మసాల - కొన్ని
ఎండుద్రాక్ష - 3 స్పూన్స్
వెన్న- 1 స్పూన్
మొగలాయి వెజ్ పలావు తయారు చేసే విధానం:
ముందుగ పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, పచ్చిమిర్చి, ధనియాలు అన్ని కలిపి మిక్సి లో వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత బియ్యని కడిగి పది నిముషాలు నాననివ్వాలి. తరువాత బియ్యని స్టవ్ మీద పెట్టి ఎక్కువ నీళ్ళలో ఉడికించి కొద్దిగా బిరుసుగా ఉన్నప్పుడే తీసి వెడల్పాటి ప్లేటులో విడి విడిగా ఉండేటట్లు పోసి బాగా ఆరనివ్వాలి.
ఇప్పుడు క్యారెట్, బీన్స్ ముక్కలు లలో కొద్దిగా ఉప్పువేసి ఉడికించాలి. తరువాత స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నె పెట్టి నూనెపోసి కాగాక మసాల దినుసులు వేసి వేగాక ముందుగ మిక్సి చేసుకున్న పచ్చి కొబ్బరి ముద్ద వేసి పచ్చి వాసనా పోయే వరకు వేయించాలి.
తరువాత అందులో ఉడికించిన క్యారెట్, బీన్స్ ముక్కలు వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉంచి ఇప్పుడు అన్నం కూడా వేసి బాగా కలిపి పైన నేతిలో వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష, వేసి బాగా కలిపి దింపుకోవాలి.అంతే గుమగుమలాడే మొగలాయి వెజ్ పలావు తయార్. పైన వెన్న తాజా పండ్ల ముక్కలు వేసి వేడి వేడిగా సర్వ్ చెయ్యాలి.