Home » Telugu Recipes » Homemade మైసూర్ బోండా cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

మైసూర్ బోండా


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే మైసూర్ బోండా మీ సొంతం.

మైసూర్ బోండా కి కావలసిన పదార్ధాలు:

మైదా -3 కప్పులు బియ్యంపిండి -1 కప్పు
పెరుగు -2 కప్పులు
జీలకర్ర - 1 స్పూన్
పచ్చిమిర్చి ముక్కలు -1 స్పూన్
సోడా ఉప్పు -కొంచం
ఉప్పు -సరిపడ
నూనె సరిపడ

మైసూర్ బోండా తయారు చేసే విధానం:

మైదాపిండిలో బియ్యంపిండి, బాగా గిలకొట్టిన పెరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి, సోడా ఉప్పు, మరియు ఉప్పు వేసి సరిపడ నీళ్ళు పోసి గారెల పిండి కన్నా కాస్త మెత్తగా కలుపుకొని ఉంచాలి.
ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాగాక ఈ పిండిని చిన్నచిన్న ఉండలాగా గుండ్రంగా చేసి నూనెలో వేసి ఎర్రగా అయిన తరువాత తీసుకోవాలి. వీటిని వేడిగా ఉన్నప్పుడు ఏ పచ్చడితో తిన్న రుచిగా ఉంటాయి.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com