కావలసిన పదార్ధాలు:
1 గ్లాస్ శనగపిండి, 2 గ్లాస్సుల నెయ్యీ, 2 గ్లాస్సుల పంచదార.
తయారు చేసే విధానం:
ముందుగ శనగపిండిని జల్లాడ పట్టుకొని పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక మందపాటి కళాయీ పెట్టుకొని పంచదార పోసి కొద్దిగా నీళ్ళు కుడా పోసి స్టవ్ వెలిగించాలి.సన్న మంట మీద కలియా పెడుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత నెయ్యీ వేసి కలుపుతూనె ఉండాలి. ఆ తరువాత శనగపిండిని కొద్దిగా కొద్దిగా పోసుకొని కలుపుతూ ఉండాలి. ఇట్లా 2o -25 నిముషాలు కలుపుతూ ఉండాలి. స్పూన్ తో తిప్పుతూ ఉంటె చివరకి స్పూన్ కి అంటుకున్న మైసూర్ పాక్ కొద్దిగా గట్టిగ అవుతుంది. దీన్ని ఒక ప్లేట్ లో కొద్దిగా నెయ్యీ వేసి ప్లేట్ మొత్తం కలిసే తట్ట్లుగా రుద్ది ఈ మిశ్రమాన్ని దాంట్లో వంపాలి. అంతే గట్టి పడిన తరువాత ముక్కలు కోసుకుంటే సరి. ఎంతో రుచి కరమైన మైసూర్ పాక్ రెడీ.