ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం మైదా బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే మైదా బిస్కెట్స్ మీ సొంతం.
మైదా బిస్కెట్స్ కి కావలసిన పదార్ధాలు:
మైదా - 1 కప్పు
గోధుమపిండి - 1 కప్పు
పంచదార - 1 కప్పు
సోడా ఉప్పు - చిటికెడు
నూనె - వేయించడానికి సరిపడ
యాలుకలు - 4
మైదా బిస్కెట్స్ తయారు చేసే విధానం:
ముందుగా పంచదారని మిక్సి చేసుకొని తరువాత మైదా, గోధుమపిండి, పంచదారపొడి యాలుకల పొడి మరియు సోడా ఉప్పుని ఒక పాత్ర లోకి తీసుకోని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి.
తరువాత ఈ పిండి ముద్దని చపాతీ లాగా చేసుకొని మనకు కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. తరువాత భాణలిలో నూనె వేసి వేడిచేసుకోవాలి. వీటిని నూనెలో వేసుకొని బంగారు వర్ణంలోనికి వచ్చేంతవరకు వేగనివ్వాలి .తరువాత బయటకు తీసి వాటిపైన పంచదార పొడిని చల్లుకోవాలి.