ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం మెక్కజొన్న హల్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే మెక్కజొన్న హల్వా మీ సొంతం.
మెక్కజొన్న హల్వా కి కావలసిన పదార్ధాలు:
లేత మెక్కజొన్నగింజలు -2కప్పులు
పాలు -2కప్పులు
కోవా -100 గ్రా
పంచదార -150గ్రా
నెయ్యి -50గ్రా
జీడిపప్పు - 2స్పూన్స్
ఎండుద్రాక్ష - 2స్పూన్స్
యాలకుల పొడి -1 /2 స్పూన్
మెక్కజొన్న హల్వా తయారు చేసే విధానం:
ముందుగ మెక్కజొన్న గింజల్నిమెత్తగా రుబ్బుకోవాలి. తరువాత అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి, పాలు
పోసి మరిగించుకోవాలి. కోవాలా చిక్కబడ్డ తరువాత నెయ్యి వేసి కొంచం సేపు బాగా కలపాలి. ఇప్పుడు పంచదార, కోవా వేసి మరో 5 నిముషాలు ఉడికించి దింపుకోవాలి.
తరువాత అందులో యాలకులపొడి, నేతిలో వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి ముందుగ నెయ్యి రాసిన ప్లేటులో పోసి ఆరిన తరువాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మెక్కజొన్న హల్వా తయార్.