Home » Telugu Recipes » Homemade మెంతి లడ్డూ cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

మెంతి లడ్డూ


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం మెంతి లడ్డూ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే మెంతి లడ్డూ మీ సొంతం.

మెంతి లడ్డూ కి కావలసిన పదార్ధాలు:

మెంతులు - 1/2కప్పు
పాలు - 2కప్పులు
గోధుమపిండి -1/4కిలో
నెయ్యి - 1కప్పు
బెల్లం లేదా పంచదార - 4కప్పులు
జీడిపప్పు,ద్రాక్ష - 1/2కప్పు

మెంతి లడ్డూ తయారు చేసే విధానం:

ముందుగ మెంతుల్ని పొడి చేసి పెట్టుకోవాలి, తరువాత ఈ పొడిని పాలల్లో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి పాలు మెంతి పొడిని కలిపి నేతిలో వేసి ఎర్రగా వేయించాలి.
తరువాత మరో బాణలిలో నెయ్యి వేసి గోధుమపిండిని కూడా వేయించాలి. తరువాత మెంతి పిండిలో గోధుమపిండి, బెల్లం లేదా పంచదార, వేయించిన జీడిపప్పుద్రాక్ష, మిగత నెయ్యి వేసి లడ్డులా చుట్టుకోవాలి. అంతే చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే మెంతి లడ్డూలు రేడి.
గమనిక : రాత్రంతా మెంతి పొడిని నానపెట్టడం వలన చేదు ఉండదు. అంతే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com