ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం మెంతి టమాటో కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే మెంతి టమాటో కూర మీ సొంతం.
మెంతి టమాటో కూర కి కావలసిన పదార్ధాలు:
టొమోటోలు - 1/2
మెంతికూర - 1 కప్పు
కొబ్బరి కోరు - 1 స్పూన్
ఉల్లిపాయ - ఒకటి
కారం - 1 స్పూన్
ఉప్పు - తగినంత
అల్లం, వెల్లులి పేస్ట్ - 1 స్పూన్
నూనె - 2 స్పూన్స్
ధనియాల పొడి - 1 స్పూన్
కొత్తిమీర - తగినంత
జీలకర్ర,ఆవాలు -1 స్పూన్
మెంతి టమాటో కూర తయారు చేసే విధానం:
బాణలిలో నూనె పోసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోధుమరంగు వచ్చేదాక వేయించాలి. అల్లం,వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. శుభ్రం చేసిన మెంతికూరను కూడా వేసి, పచ్చి వాసన పోయేంతదాకా వేయించాలి.
తరవాత టోమోటో ముక్కల్ని వేసి కలియబెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. అందులోనే కారం, ఉప్పు, ధనియాలపొడి, కొబ్బరికోరు ఒకదాని తరువాత ఒకటి వరుసగా వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమం కాస్త ముద్దగా అయిన తరువాత దించేసి, చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే మెంతి టొమోటో కర్రీ తయార్..! దీన్ని వేడి వేడి అన్నంలోగాని, చపాతీల్లో కలుపుకుని తింటే భలే రుచిగా ఉంటుంది.