ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం మీల్ మేకర్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే మీల్ మేకర్ మంచూరియా మీ సొంతం.
మీల్ మేకర్ మంచూరియా కి కావలసిన పదార్ధాలు:
మీల్ మేకర్ - 1 కప్పు
వెల్లుల్లి - 25 గ్రా
సోయాసాస్- 11/2 స్పూన్
పచ్చిమిర్చి - 7
వెనిగర్ - 1 స్పూన్
ఉల్లి పొరక -1 కప్పు
అల్లం - పెద్ద ముక్క
ఉప్పు - సరిపడ
అజినోమోటో -1/2 స్పూన్
కొత్తిమీర - పెద్దకట్ట
కార్న్ ఫ్లోర్ - 1/2 స్పూన్
ఆరెంజ్ కలర్ - కొద్దిగ
నూనె - 100 గ్రా
మీల్ మేకర్ మంచూరియా తయారు చేసే విధానం:
ముందుగా మీల్ మేకర్ ని నీటిలో నానపెట్టుకోవాలి. ఆపై 8 నిముషాలు వేడి నీటిలో ఉడికించాలి. తరువాత నీటిని తీసేసి గట్టగా పిండి కాగిన నూనెలో వేసి వేయించి తియ్యాలి. ఇప్పుడు బాణలిలో మిగత నూనెపోసి కాగాక పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలను వేసి బాగా వేగిన తరువాత వేయించిన మీల్ మేకర్ ని వెయ్యాలి. తరువాత అందులో అరగ్లాస్ నీళ్ళు పోసి సోయాసాస్, వెనిగర్, అజినోమోటో వేసి రెండు నిముషాలు ఉడికించాలి.
ఇప్పుడు అందులో సరిపడ ఉప్పు, వేసి కార్న్ ఫ్లోర్, ఆరెంజ్ కలర్ ని విడి విడిగా కొద్దిగా నీళ్ళలో కలిపి వేయాలి. ఆ నీరు ఇంకిపోయే వరకు కలపాలి. ముక్కలు విడి విడిగా వచ్చే వరకు ఉంచి పైన ఉల్లి కాడల ముక్కలు కొత్తిమీర చల్లి దించెయ్యాలి. అంతే నోరూరించే మీల్ మేకర్ మంచూరియా తయార్.