ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం మిల్క్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే మిల్క్ కేక్ మీ సొంతం.
మిల్క్ కేక్ కి కావలసిన పదార్ధాలు:
పాలు - 1/2 లీటర్
పంచదార - 1/4 కప్పు
నిమ్మరసం - 1 స్పూన్
పిస్తా,బాదంపప్పు - కొద్దిగా
మిల్క్ కేక్ తయారు చేసే విధానం:
ముందుగ ఒక మందపాటి పాత్రలో పాలు పోసి బాగా మరిగించాలి. తరువాత నిమ్మరసాన్ని కొద్దిగా నీళ్ళలో కలిపి మెల్లగా
ఒక్కో చుక్కా పాలలో కలపాలి. పాలు విరగిపోకుండా బాగా చిక్కపడే వరకు గరిటెతో కలుపుతూనే ఉండాలి.
ఇప్పుడు అందులో పంచదార కలిపి నీరంతా ఆవిరయ్యేవరకు కోవాలా ఉడికించాలి. తరువాత అంచులున్న ప్లేటు తీసుకుని
అడుగున నెయ్యి రాసి పైన బాదం, పిస్తా ముక్కల్ని చల్లాలి. దానిమీద ఉడికించిన కోవాను పోసి సమంగా సర్ది ఆరిన తరువాత
మనకు కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. అంతే నోరూరించే మిల్క్ కేక్ తయార్.