ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం మిర్చీ పన్నీర్ కర్రి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే మిర్చీ పన్నీర్ కర్రి మీ సొంతం.
మిర్చీ పన్నీర్ కర్రి కి కావలసిన పదార్ధాలు:
పన్నీర్ - 250 గ్రా
ఉల్లిపాయలు - 2
క్యాఫ్సికమ్ - 3
టమోటో -2
అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 స్పూన్
కరివేపాకు - కొద్దిగా
కొత్తిమీర -సరిపడ
పసుపు - 1/2 స్పూన్
కారం - 2 స్పూన్స్
పోపు గింజలు -1 స్పూన్
ఉప్పు - సరిపడ
గరం మసాలా - 1 స్పూన్
నూనె - సరిపడ
మిర్చీ పన్నీర్ కర్రి తయారు చేసే విధానం:
ముందుగా పన్నీర్ ని ముక్కలుగా కట్ చేసి స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగాక పన్నీర్ ముక్కలు వేసి దోరగా వేయించి తీసి చల్లటి నీళ్ళలో వేయాలి. ఇప్పుడు బాణలిలో కొద్దిగా నూనె పోసి పోపు గింజలు వేయాలి. ఇవి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
ఇప్పుడు సన్నగా తరిగిన క్యాప్సికమ్, టమోటోలు వేసి మూత పెట్టి బాగా మగ్గించాలి. అవి బాగా ఉడికిన తరువాత చివరగా పన్నీర్ ముక్కలను గట్టిగ పిండి అందులో వేసి గరం మసాలా కూడా వేసి బాగా కలిపి మరో ఐదు నిముషాలు ఉడికించి దించేయాలి అంతే మిర్చీ పన్నీర్ రెడీ.