ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే మామిడికాయ పులిహోర మీ సొంతం.
మామిడికాయ పులిహోర కి కావలసిన పదార్ధాలు:
బియ్యం - 2 కప్పులు
నీళ్లు - 4 కప్పులు
మామిడి కాయ -1(పెద్దది)
పల్లీలు -1/2 కప్పు
జీడిపప్పు - కొద్దిగా
నూనె - సరిపడ
కరివేపాకు - సరిపడ
ఉప్పు - సరిపడ
పచ్చిమిర్చి - 8
పసుపు -1 స్పూన్
ఆవాలు -1 స్పూన్
ఎండుమిర్చి - 4
మినపప్పు -1 స్పూన్
శెనగపప్పు -2 స్పూన్స్
ఇంగువ - చిటికెడు
మామిడికాయ పులిహోర తయారు చేసే విధానం:
ముందుగ ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోసి అన్నం వండుకోవాలి. తరువాత ఒక ప్లేట్ లో ఆరబెట్టుకోవాలి. దీనికి కొంచెం నూనె, పసుపు వేసి కలబెట్టుకోవాలి. మామిడి కాయను తురిమి తర్వాత పసుపు, ఉప్పు వేసి అన్నంలో కలపాలి.
తరువాత బాణలిలో నూనె పోసి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, వేరుశెనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇంగువను వేయాలి. ఈ తాలింపును మామిడికాయ తురుమును కలిపిన అన్నంలో వేసి, సరిపడ ఉప్పు కలుపుకోవాలి. అంతే నోరూరించే మామిడికాయ పులిహోర రెడీ.