ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం మసాల బాత్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే మసాల బాత్ రైస్ మీ సొంతం.
మసాల బాత్ రైస్ కి కావలసిన పదార్ధాలు:
బియ్యం - 1/2 కేజీ
జీడిపప్పు - సరిపడ
జీలకర్రపొడి - 1 స్పూన్
దాల్చిన చెక్క - కొద్దిగా
ఇంగువ - చిటికెడు
ఆవాలు - 1 స్పూన్
నెయ్యి - 50 గ్రా
దొండకాయలు - 150 గ్రా
పచ్చిమిర్చి- 6
ధనియాల పొడి - 1 స్పూన్
నువ్వులు -1 స్పూన్
ఎండుకొబ్బరి పొడి - 2 స్పూన్స్
లవంగాలు -కొన్ని
ఉప్పు -రుచికి సరిపడ
మసాల బాత్ రైస్ తయారు చేసే విధానం:
ముందుగ పొయ్యిమీద గిన్నె పెట్టి నెయ్యి వేడిచేయాలి. ఇందులో ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టాలి. ఇప్పుడు పొడవుగా తరిగిన దొండకాయల ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు వేయించాలి. ఇందులోనే కడిగిన బియ్యం వేసి కొద్దిగా ఫ్రై చేసి రెండింతలు నీళ్లుపోసి కలియ బెట్టి పెద్దమంట మీద ఉడికించాలి.
అన్నం సగం ఉడకగానే పైన చెప్పిన మసాలాలు అన్ని కలిపి మిక్సి చేసిన పొడి, ఎండుకొబ్బరి, ఉప్పు, నువ్వుల పొడి వేసి కలిపి సన్నమంట మీద ఉడికిస్తే మసాలా బాత్ రైస్ రెడీ. స్టౌ మీద నుండి దించాక పైన కొత్తిమీర, వేయించిన జీడిపప్పు తో అలంకరించి సర్వ్ చేయాలి.