Home » Telugu Recipes » Homemade మసాల కాలిఫ్లవర్ cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

మసాల కాలిఫ్లవర్


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం మసాల కాలిఫ్లవర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే మసాల కాలిఫ్లవర్ మీ సొంతం.

మసాల కాలిఫ్లవర్ కి కావలసిన పదార్ధాలు:

ముక్కలుగా తరిగిన ఒక పెద్ద కాలిఫ్లవర్ , వేయించడానికి సరిపడా నూనె, 2 ఉల్లిపాయలు, 2 పచ్చి మిరపకాయలు, 8 వెల్లుల్లి ముక్కలు, ఒక చిన్న అల్లం ముక్క, 2 టమాటాలు, 1 టీ స్పూన్ కారం, గరం మసాల, ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, మెంతులు, తగినంత ఉప్పు.

మసాల కాలిఫ్లవర్ తయారు చేసే విధానం:

ముందుగా కాలిఫ్లవర్ ముక్కలు నూనెలో బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇపుడు ఒక కడాయి లో 2 టేబుల్ స్పూన్ ల నూనె వేసి అందులో ఉల్లిపాయ పేస్టు, అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి వేసి అన్ని రంగులోకి మారే వరకు వేయించాలి. తరువాత టమాటా పేస్టును కలపాలి. ఆ తరువాత కారం, గరంమసాల, ధనియాల పొడి, మెంతులు, ఉప్పు వేసి నూనె వేరుగా అయ్యే వరకీ బాగా వేయించాలి. ఇప్పుడు కాలిఫ్లవర్ ముక్కలు, 1/2 కప్పు నీళ్ళు పోసి బాగా కలపాలి. అంతే కాలిఫ్లవర్ మసాల రెడీ.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com