ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం మష్రూమ్స్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే మష్రూమ్స్ మంచూరియా మీ సొంతం.
మష్రూమ్స్ మంచూరియా కి కావలసిన పదార్ధాలు:
మష్రూమ్స్ - 250 గ్రా
కార్న్ ఫ్లోర్ - 20 గ్రా
మైదా - 50 గ్రా
అల్లం - చిన్న ముక్క
టమోటా సాస్ - 2 స్పూన్స్
సోయాసాస్ - 1 స్పూన్
చిల్లీ సాస్ -1 స్పూన్
పెప్పర్ - 1 స్పూన్
కొత్తిమీర - కొద్దిగా
పచ్చిమిర్చి - 4
వెల్లుల్లి - 4
ఉప్పు - సరిపడ
నూనె - సరిపడ
మష్రూమ్స్ మంచూరియా తయారు చేసే విధానం:
ముందుగా మష్రూమ్స్ (పుట్టగొడుగులు) ను బాగా కడిగి ఒక గిన్నెలో వేసి వాటికి కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఒక పదివిమిషాలు పక్కన ఉంచాలి. మరో గిన్నే తీసుకుని దానిలో మైదా, కార్న్ ఫ్లోర్, పెప్పర్, చిల్లీసాన్, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లుపోసి బాగా కలిపి మష్రూమ్స్ వేసి బాగా కలుపుకోవాలి. వీటిని నూనెలో డిఫ్రై చేసుకొని పక్కన పెట్టాలి.
తరువాత బాణలిలో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం సన్నగా తరిగి నూనెలో వేసి ఒక నిముషం వేయించి, సోయాసాస్, టమోటా సాస్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి అందులో వేయించి ఉంచుకున్న మష్పూమ్స్ ను వేసి బాగా కలిపి రెండు నిముషాలు ఉంచి దించుకోవాలి. ఇప్పుడు ప్లేట్ లో మష్రూమ్స్ మంచూరియా వేసి పైన సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.