Home » Telugu Recipes » Homemade మద్రాస్ ఉండల పులుసు cooking recipe
GumaGumalu Recipes
Recipes Food Court Specials Andhra Recipes How To Cook Cooking School Blog  

About Telugu Recipes

మద్రాస్ ఉండల పులుసు


ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం మద్రాస్ ఉండల పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే మద్రాస్ ఉండల పులుసు మీ సొంతం.

మద్రాస్ ఉండల పులుసు కి కావలసిన పదార్ధాలు:

సెనగపప్పు - 1 కప్పు
కందిపప్పు -1 కప్పు
కొబ్బరికాయ - ఒకటి
టమోటాలు - 2
ఉల్లిపాయలు -2
పచ్చిమిర్చి -4
చింతపండు రసం -కొంచం
అల్లంవెల్లుల్లి ముద్ద -1 స్పూన్
ఉప్పు - సరిపడ
కారం -2 స్పూన్స్
పసుపు -చిటికెడు
జీలకర్ర పొడి - 1స్పూన్
ధనియాలపొడి - 2స్పూన్స్
కరివేపాకు,కొత్తిమీర -సరిపడ
నూనె -సరిపడ
పోపు గింజలు - 1స్పూన్

మద్రాస్ ఉండల పులుసు తయారు చేసే విధానం:

ముందుగ సెనగపప్పు, కందిపప్పుని 2 గంటలు నానపెట్టుకోవాలి. తరువాత వీటికి పచ్చిమిర్చి కలిపి మిక్సి చేసుకోవాలి ఇప్పుడు ఈ ముద్ధలోనే సరిపడ ఉప్పు, సగం ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర సగం కొబ్బరి తురుము కలిపి చిన్నఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
తరువాత బాణలిలో వేసి కాగాక పోపు గింజలు మిగత ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, వేసి వేయించాలి. అవి వేగాక చింతపండు రసం, మిగత కొబ్బరితురుము కూడా వేయాలి. ఇప్పుడు అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, సరిపడ ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. పులుసు మరుగుతుండగా ముందుగ నాలుగు ఉండాలని వేయాలి. అవి ఉడికి పైకి వస్తున్నప్పుడు మరో నాలుగు వేయాలి. ఇలాగే అన్ని వేసి మరిగించాలి. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకొని దింపుకోవాలి. తమిళులు ఎంతో ఇష్టంగా తీసుకునే ఉండల పులుసు తయార్.
గమనిక: ఈ పులుసు రెండు, మూడు రోజులవరకు నిల్వ ఉంచుకోవచ్చు.

Search Recipes (over 5000 recipes)
 
Home Remedies

Recipes - Specials - Food Court - Ingredient Glossary - Recipe Aricles - Health Remedies - Home
All Rights Reserved. Copyright 2010 GumaGumalu.com