ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే బ్రెడ్ హల్వా మీ సొంతం.
బ్రెడ్ హల్వా కి కావలసిన పదార్ధాలు:
8 బ్రెడ్ ముక్కలు, 1 గ్లాస్ పంచదార, 1 /2 గ్లాస్ నెయ్యీ, 1 గ్లాస్ కాగిన పాలు, 50 గ్రాముల జీడిపప్పు.
బ్రెడ్ హల్వా తయారు చేసే విధానం:
ఒక ప్యాన్ లో నెయ్యీ పోసి కాగిన తరువాత జీడిపప్పు వేసి దోరగా వేగనివ్వాలి. తరువాత వేగిన జీడిపప్పు తీసి ప్లేటులో పెట్టుకోవాలి. తరువాత అదే నెయ్యీలోబ్రెడ్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దోరగా వేగనివ్వాలి. తరువాత వేగిన బ్రెడ్ ముక్కలు ప్లేటులో పెట్టుకోవాలి. తరువాత ప్యాన్ లోకాగిన పాలు పోసి, పంచదార వేసి పంచదార కరిగిన తరువాత బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇదంతా సన్న మంట మీదనే చెయ్యాలి. హల్వా దగ్గరకి అయ్యే అంతవరకూ కలుపుతూనే ఉండాలి. నెయ్యీ విడిపడే అంతవరకూ కలపాలి .అంతేబ్రెడ్ హల్వా రెడీ . దీన్ని ఒక మంచి బౌల్లో పెట్టుకోని వేగిన జీడిపప్పు కలుపుకుంటే సరి.