ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం బ్రెడ్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే బ్రెడ్ ఉప్మా మీ సొంతం.
బ్రెడ్ ఉప్మా కి కావలసిన పదార్ధాలు:
బ్రెడ్ - 1 ప్యాకెట్
ఉల్లిపాయలు -2
పచ్చిమిర్చి -3
సెనగపప్పు - 1 స్పూన్
మినపప్పు - 1 స్పూన్
ఉప్పు -సరపడ
ఆవాలు - 1 స్పూన్
నిమ్మకాయ -1
కొత్తిమీర- కొంచం
నూనె- 5 స్పూన్స్
బ్రెడ్ ఉప్మా తయారు చేసే విధానం:
ముందుగా బ్రెడ్ అంచుల్ని తీసేసి ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగాక ఆవాలు, సెనగపప్పు, మినపప్పు, వేసి బాగా బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
తరువాత బ్రెడ్ ముక్కలు, సరిపడ ఉప్పు వేసి బాగా కలిపి దింపుకోవాలి. ఇప్పుడు దీని పై నిమ్మరసం కొత్తిమీర చల్లుకోవాలి.
అంతే రుచికరమైన బ్రెడ్ ఉప్మా రేడి.