ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం బెల్లంకాకరకాయఇగురు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే బెల్లంకాకరకాయఇగురు మీ సొంతం.
బెల్లంకాకరకాయఇగురు కి కావలసిన పదార్ధాలు:
కాకరకాయలు -1/4 కేజీ
ఉల్లిపాయలు - 2
పోపుగింజలు - 1 స్పూన్
కారం - 1 స్పూన్
ఎండుమిర్చి - 3
బెల్లం- 100 గ్రా
చింతపండుగుజ్జు - 3 స్పూన్స్
ఉప్పు - తగినంత
నూనె - సరిపడ
బెల్లంకాకరకాయఇగురు తయారు చేసే విధానం:
ముందుగా కాకరకాయల పొట్టు తీసి సన్న ముక్కలుగా తరగాలి. ఇప్పుడు ఈ ముక్కలపై ఉప్పు చల్లి నీళ్లు పోసి ఉడికించాలి. కొద్దిగా ఉడికిన తరువాత నీళ్లన్నింటినీ వార్చేయాలి. తరువాత ఓ వెడల్పాటి బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
ఇప్పుడు ఇందులో ఉడికించిన కాకరకాయ ముక్కలు, కారం, బెల్లం వేసి నీరు ఆవిరయ్యేంతదాకా సన్నటి మంటమీద మగ్గించాలి. బెల్లం, పాకంల్లా మారి కాకరకాయ ముక్కలకు అంటుకున్న తరువాత చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు వేసి కలిపి కాసేపు ఉడికించి దించేయాలి.