ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం బెండకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే బెండకాయ వేపుడు మీ సొంతం.
బెండకాయ వేపుడు కి కావలసిన పదార్ధాలు:
పావు కిలో బెండకాయలు,వెల్లుల్లి, కారం, నూనె, పెద్ద ఉల్లిపాయ, పల్లీలు,జీలకర్ర.
బెండకాయ వేపుడు తయారు చేసే విధానం:
పెద్ద ఉల్లిపాయలు 2 కడిగి పొడుగ్గా, సన్నగా చీలికలు చేసుకోవాలి. బెండకాయలు సన్నగా ముక్కలు చేసుకోవాలి.ఒక ప్యాన్ లో నూనె వేసి కాగాక పల్లీలు,జీలకర్ర వేసి దోరగా వేయించాలి.తరువాత దానిలోనే బెండకాయముక్కలువేసి దోరగా వేయించాలి.తరువాత దానిలోనే పెద్ద ఉల్లిపాయ ముక్కలువేసి దోరగా వేయించాలి. తరువాత సరిపడా వెల్లుల్లి కారం వేసి వేయించాలి. ఇక ఘుమఘుమలాడే బెండకాయ వేపుడు తయార్.