ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం బెంగుళూర్ బటర్ మసాల ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే బెంగుళూర్ బటర్ మసాల మీ సొంతం.
బెంగుళూర్ బటర్ మసాల కి కావలసిన పదార్ధాలు:
బంగాళాదుంపలు - 1/4 కేజీ
పచ్చి బటనిలు - 1/2 కప్పు
ఉల్లిపాయలు - 3
టమాట- 2
పచ్చిమిర్చి -4
పచ్చిశనగపప్పు - 2 స్పూన్స్
ధనియాల పొడి- 1/2 స్పూన్
గరం మసాల- 1/2 స్పూన్
వెన్న - 2 స్పూన్స్
పోపుగింజలు - 2 స్పూన్స్
ఉప్పు -సరిపడ
క్యారెట్- 1
కొత్తిమీర- సరిపడ
బెంగుళూర్ బటర్ మసాల తయారు చేసే విధానం:
ముందుగ బంగాలదుంపలను, పచ్చి బటనిలు శుభ్రంగా కడిగి విడివిడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి వెన్న వేసి కరిగిన తరువాత పోపుగింజలు, పచ్చిశనగపప్పు, వేసి చిటపటలాడాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి.
తరువాత ఉడికించిన బంగాలదుంపలను పొట్టు తీసి మెత్తగా చేసుకొని అందులో వేయాలి, ఇప్పుడు ఉడికించిన బటనీలు కూడా వేసి, సరిపడ ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాల వేసి బాగా కలిపి రెండు నిముషాలు ఉంచి పైన క్యారెట్ తురుము, కొత్తిమీర చల్లి దించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బెంగుళూర్ బటర్ మసాల తయార్. దీనిని చపాతితో తింటే చాలారుచిగా ఉంటుంది.