ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం బీట్‌రూట్ కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే బీట్‌రూట్ కూర మీ సొంతం.
బీట్‌రూట్ కూర కి కావలసిన పదార్ధాలు:
బీట్‌రూట్ -1/4 కేజీ
పెసరపప్పు - 2 స్పూన్స్
పచ్చికొబ్బరి - 1 చిప్ప
పచ్చిమిర్చి -8
ఉప్పు - సరిపడ
పసుపు - కొద్దిగ
పోపు గింజలు - 2 స్పూన్స్
నూనె - 4 స్పూన్స్
బీట్‌రూట్ కూర తయారు చేసే విధానం:
ముందుగా బీట్‌రూట్ పై చెక్కు తీసి నీటిలో బాగా కడిగి తురుముకోవాలి. అలాగే కొబ్బరి కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి నూనె పోసి పోపు గింజలు, కరివేపాకు వేసి వేగాక నానబెట్టిన పెసరపప్పు, తురిమి పెట్టుకున్న బీట్‌రూట్ వేసి సన్నని మంట మీద ఉంచి కలుపుతూ ఉండాలి.
బాగా మెత్తగా ఉడికిన తరువాత పచ్చి మిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, వేసి కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉంచి చివరగా కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి 2 నిమిషాలు కలిపి దింపుకోవాలి.అంతే రుచి కరమైన బీట్‌రూట్ కూర రేడి.