ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం బాదుషా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే బాదుషా మీ సొంతం.
బాదుషా కి కావలసిన పదార్ధాలు:
మైదా - 4 కప్పులు
వెన్న - 8 స్పూన్స్
పంచదార -3 కప్పులు
బేకింగ్ సోడా -1/2 స్పూన్
ఉప్పు - చిటికెడు
యాలకుల పొడి - 1/2 స్పూన్
నెయ్యి లేక నూనె -సరిపడ
బాదుషా తయారు చేసే విధానం:
మైదాలో బేకింగ్ సోడా కలిపి కొద్దిగా నీళ్ళు చల్లి వెన్న, ఉప్పు వేసి పిండిని మెత్తని ముద్దలా కలపాలి. మరీ గట్టిగ చపాతీ పిండిల కాకుండా కాస్త మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని, అరచేతిలో కాస్త వత్తి మద్యలో చిన్న గుంట వచ్చేలా బొటనవేలితో వత్తాలి.
తరువాత బాణలిలో నూనె పోసి కాగాక ఈ బాదుషాలను వేసి బంగారు వర్ణంలోకి వచ్చేలా వేయించాలి. తరువాత ఒక గిన్నెలో పంచదార వేసి ఒక కప్పు నీళ్ళు పోసి పాకం రానివ్వాలి. అందులోనే యాలకుల పొడి వేసి కలపాలి. లేత పాకం వచ్చిన తరువాత దింపుకోవాలి. ఇప్పుడు బాదుషాలను పాకం లో వేసి రెండు మూడు నిముషాలు ఉంచి తీయాలి.(పాకంలో ఎక్కువ సేపు ఉంచకూడదు) అంతే ఇంట్లోనే తయారు చేసుకునే రుచికరమైన బాదుషాలు తయార్.