కావలసిన పదార్ధాలు:
షర్బత్ సిరప్, అర కేజీ బాదం, పంచదార 2 కేజీ, నీళ్ళు ఒక కేజీ, కుంకుమ పువ్వు ఒక టీ స్పూన్, ఏలకుల పొడి ఒక టీ స్పూన్, అర టీ స్పూన్ పొటాషియం మెటా బై సల్ఫేట్.
తయారు చేసే విధానం:
బాదంను 8-10 గంటలపాటు నీళ్ళలో నానబెట్టాలి. తరువాత దాని తోలు తెసేయాలి.ఆ తరువాత నీళ్ళలో పంచదార, కుంకుం పువ్వు, ఏలకుల పొడి వేసి మరిగించి పాకంలా తాయారు చేయాలి. ఆ తరువాత చల్లార్చాలి. ఇప్పుడు బాదం, షర్బత్ సిరప్ కలిపి మెత్తని పేస్టు లాగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఆ పేస్టు, మొదట తయారు చేసిన పాకం రెండూ కలిపి అందులో పొటాషియం మెటా బై సల్ఫేట్ వేస్తె చాలు. బాదం షర్బత్ రెడీ.