ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం బాంబినో దోశె ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే బాంబినో దోశె మీ సొంతం.
బాంబినో దోశె కి కావలసిన పదార్ధాలు:
బాంబినో -250 గ్రా
మజ్జిగ - 2 కప్పులు
నూనె -100 గ్రా
బియ్యంపిండి - 1/2 కేజీ
ఉల్లిపాయలు -2
పచ్చిమిర్చి- 5
ఉప్పు -సరిపడ
బాంబినో దోశె తయారు చేసే విధానం:
బాంబినో ఒక గంట ముందు మజ్జిగ లో వేసి నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా నానిన బాంబినో ని చేత్తో మెత్తగా నలుపుకోవాలి. తరువాత అందులో బియ్యంపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు సరిపడ నీళ్ళు పోసి దోశెల పిండిలాగా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి కాలిన తరువాత గరిటతో పలుచగా వేసుకొని రెండు వైపులా నూనె వేసి కాల్చుకొని తీసుకోవాలి. అంతే కరకర లాడే బాంబినో దోశె తయార్. దీనిని కొబ్బరి చెట్నితో వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.